- సాదరంగా ఆహ్వానించిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి : కాంగ్రెస్ ప్రజాపాలనకు మెచ్చి పలువురు నాయకులు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు బషీరుద్దీన్, మహమ్మద్ రషీద్ ఆధ్వర్యంలో కొండాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు నసిరుద్దీన్, మార్తాండ నగర్ యూత్ నాయకులు జలీల్ తదితరులు పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ వీరికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో గౌసుద్దీన్, షేక్ ఇబ్రహీం, మహమ్మద్ ఫిరోజ్, చంద్ మియా పాల్గొన్నారు.