భర్తే హంతకుడు.. మహిళ మిస్సింగ్ కేసు చేధించిన మియాపూర్ పోలీసులు

  • 12వ తేదీన రాజేశ్వరి అదృశ్యం
  • అల్లుడిపైనే అనుమానం ఉందని 14న తన తల్లి స్వరూప ఫిర్యాదు
  • విచారణలో బయటపడిన వాస్తవం.. భార్యను హత్య చేశానని ఒప్పుకున్న రాజేష్
  • అభినందనలు తెలిపి మియాపూర్ బృందానికి పారితోషికం అందజేత

నమస్తే శేరిలింగంపల్లి : మహిళా మిస్సింగ్ కేసును మియాపూర్ పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. మియాపూర్ డివిజన్ ఏసీపీ, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, సబ్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, పి.ఎస్.ల సమన్వయంతో తన భర్తే ఆ మహిళను హత్య చేసినట్టుగా విచారణలో గుర్తించి నిందితుడిని కటాకటాలకు పంపించారు.

  • మియాపూర్ పోలీసుల కథనం ప్రకారం..

కమ్మరి రాజేష్ (40), రాజేశ్వరి (36) భార్యభర్తలు, వారికి ఇద్దరు పిల్లలు. 2011 సంవత్సరంలో రాజేష్ తన భార్యతో కలిసి వచ్చి మియాపూర్ లోని ఎం. ఏ నగర్ లో నివసిస్తున్నారు. అయితే గత రెండేండ్ల నుంచి భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. అయితే ఈ నెల 12వ తేదీన రాజేశ్వరి కనిపించకుండా పోయింది. విషయం తెలియగానే ఆందోళన చెందిన తన తల్లి విశ్వనాథుల స్వరూప (60) 14వ తేదీన మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన అల్లుడిపైనే అనుమానం ఉందని ఆ ఫిర్యాదులో పేర్కొంది. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. డిసెంబర్19వ తేదీన రాజేశ్ ను అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రాజేశ్వరిని తానే హత్య చేసినట్లు స్వచ్ఛందంగా ఒప్పుకున్నాడు.

హత్యకు గురైన రాజేశ్వరి (36)

గత రెండేండ్లుగా మా మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని, తరచూ మహిళలతో ఫోన్లో మాట్లాడుతుంటే గొడవ పడేదని, గ్రామానికి వెళ్లి పిల్లలను, తల్లిదండ్రులను చూసుకోవాలని చెప్పిన అంగీకరించలేదని, తన వైఖరితో విసిగిపోయానని విచారణలో చెప్పాడని పోలీసులు తెలిపారు. మిగతా విషయాలు పోలీసులు వెల్లడించారు. గత కొన్ని నెలలుగా ఎవరితో మాట్లాడినా అనుమానం వచ్చి తన భార్య అతడితో గొడవ పడిందని, నవంబర్ 30న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఒటేసేందుకు స్వగ్రామానికి వెళ్లి తిరిగి వచ్చిందని, డిసెంబర్ 2వ తేదీన మళ్ళీ వారిద్దరి మధ్య గొడవ మొదలవగా రాజేష్ తన భార్యపై పగపెంచుకుని హత్య చేసేందుకు పతకం రచించాడని తెలిపారు. తన ప్లాన్ లో భాగంగా 10వ తేదీన గండిమైసమ్మ దగ్గర ఫంక్షన్ ఉందని చెప్పి తన భార్యను సాయంత్రం 6.30 గంటలకు తన హోండా డియోనంబర్ TS-13EC-1473పై బొల్లారం రోడ్డు నుండి బాచుపల్లి మీదుగా దుండిగల్ ORR బోరంపేట సర్వీస్ రోడ్డుకు వెళ్తుండగా, ఒక సెల్ టవర్ దాటిన తర్వాత కల్వర్ట్ దగ్గర తన వాహనాన్ని ఆపాడు. చుట్టూ పక్కల పరిశీలించి ఎవరూ లేకపోవడంతో తన భార్యను ఒంటరిగా ఉన్న పొదల్లోకి బలవంతంగా తీసుకెళ్లాడు. ఆమెను నెట్టేసి ఆమె తల వెనుక భాగంలో గ్రానైట్ రాయితో మోదగా కిందపడి తీవ్ర రక్తం స్రావమైంది. అంతటితో ఆగకుండా మళ్ళీ ఆమె ముఖం పై చిన్న గ్రానైట్ రాయిని విసరడంతో ఆమె అక్కడే మరణించింది. మియాపూర్ ఏసీపీ పి.నర్సింహారావు, ఇన్ స్పెక్టర్ ఎం. ప్రేమ్ కుమార్, సబ్ ఇన్ స్పెక్టర్ కె. గిరీష్ కుమార్ మార్గదర్శకత్వంలో మియాపూర్ క్రైమ్ బృందం నిందితులను పట్టుకుని కేసును ఛేదించి కీలక పాత్ర వహించినందుకు తగిన పారితోషికం అందించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here