- పాల్గొన్న భేరీ రామచందర్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి : వనపర్తి జిల్లా గొర్రెల మేకల పెంపకం దార్ల జిల్లా అధ్యక్షులు మధు యాదవ్ ఆధ్వర్యంలో 12వ రోజు బీపీ మండల్ దివస్ కొనసాగింది. ఈ సందర్భంగా బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర యాదవ్ పాల్గొని మాట్లాడారు. భారత దేశవ్యాప్తంగా వెనుకబడిన కులాలు, బీసీల్లో స్థితిగతుల మీద అధ్యయనం చేసి బీసీలకు దామాషా పద్ధతిన రిజర్వేషన్లు కల్పించాలని, రాజకీయవాట విద్యా, వైద్యం ఉద్యోగాలు అన్ని రంగాల్లో దామాషా పద్ధతిన రిజర్వేషన్ కల్పించాలని పోరాడిన గొప్ప మహనీయుడు బిందెశ్వర్ ప్రసాద్ యాదవ్ అని, బీపీ మండల్ ఆశయాలను అన్ని కుల సంఘాలు ఐక్యమై ప్రభుత్వాల మీద పోరాడి తమ తమ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీల కులగనణ చేపట్టి 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని మాటిచ్చారని, ఆ మాటకు కట్టుబడి ఉండాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ నాయకులు దొంతిపోయిన శ్రీనివాస్ యాదవ్, కృష్ణ గౌడ్, రాజు ముదిరాజ్, అశోక్ పద్మశాలి, రజక సంఘం కృష్ణ, నాయి బ్రాహ్మణ సంఘం కిరణ్, బీసీ కుల సంఘాల అధ్యక్షులు కార్యదర్శులు పాల్గొన్నారు