నమస్తే శేరిలింగంపల్లి: క్షీరాబ్ధి ద్వాదశి సందర్బంగా లోక కల్యాణార్థం చందానగర్ లోని విశాఖ శ్రీ శారదా పీఠపాలిత వెంకటేశ్వరాలయంలో 108 దంపతులతో సామూహిక కల్యాణోత్సవం నిర్వహించారు. మధ్యాహ్నం 1గంటకు అన్న ప్రసాద వితరణ చేపట్టారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేయించాలనుకునే భక్తులు రూ. 1516 చెల్లించి స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని దేవాలయ కమిటీ తెలిపింది.