నమస్తే శేరిలింగంపల్లి: శిల్పారామం మాదాపూర్ లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా నృత్యం కథక్ కళాక్షేత్ర గురువు డాక్టర్ చంద్రతప సహా రాయ్ శిష్య బృందం చేసిన కథక్ నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. సరస్వతి వందన, శివ వందన, గురు వందన, జప్తల్, తరణ, తీంతల్ , కళావతి తరణ, రవి శంకర్ జి తరణ, శివ వందన, రూపక తాళ్, దేవి స్తుతి మొదలైన అంశాలను బిధ్యా, ఆరోహి, వార్షిత, ప్రేరణ, మిహిక, గాయత్రీ, తన్వి, అనుపమ, శ్వేతా, ఇనాయ, ఆషిత, వైష్ణవి మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు.
