నమస్తే శేరిలింగంపల్లి: వినాయక చవితి పర్వదినం ను పురస్కరించుకుని హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ హఫీజ్ పేట్ హనుమాన్ యూత్ ఆదర్యంలో లో ఏర్పాటు చేసిన వినాయకుని మండపాన్ని సోమవారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సందర్శించారు. వినాయకునికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు హనుమాన్ యూత్ ప్రతినిధులు కనకమామిడి నరెందర్ గౌడ్, వెంకటేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, చేగూరి సాయిరాం గౌడ్, వెంకట్ ముదిరాజ్, సురేందర్ గౌడ్, రాధాకృష్ణ, రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.