తుల్జ‌భ‌వానీ యూత్ గ‌ణేశుడి లడ్డును రూ.1.80 ల‌క్ష‌ల‌కు ద‌క్కించుకున్న సుప్ర‌జ ప్ర‌వీణ్

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తారానగర్ తుల్జాభవాని ఆలయం వద్ద తుల్జాభవాని యూత్ అసోసియేషన్ గ‌ణ‌నాథుడి నిమ‌జ్జ‌న కార్య‌క్ర‌మం ఘ‌నంగా జ‌రిగింది. తొమ్మిది రోజులు పూజ‌లందుకున్న‌ గణేశుని లడ్డును సుప్రజ గ్రూప్స్ అధినేత తుడి ప్రవీణ్ కైవసం చేసుకున్నారు. లడ్డును వేలం పాట వేయగా రూ.1.80 లక్షలకు సుప్రజ ప్రవీణ్ దక్కించుకున్నారు. రెండో లడ్డును సుప్రజ ప్రవీణ్ కూతురు సాహితీ లక్కీ డ్రా తీయగా బాల్ రాజ్ యాదవ్‌ను ల‌డ్డూ వ‌రించింది. క‌మిటీ స‌భ్యులు వారిరువురికి ల‌డ్డూల‌ను అంద‌జేశారు. సుప్ర‌జ ప్ర‌వీన్ మాట్లాడుతూ వినాయ‌కుడి ల‌డ్డు ఎంతో మ‌హిమ గ‌ల‌ద‌ని, ఈ క్ర‌మంలోనే గ‌త కొన్నేళ్లుగా తోచిన స్థాయిలో ప‌విత్ర‌మైన ల‌డ్డూల‌ను పొందే ప్ర‌య‌త్నం చేస్తున్నాన‌ని అన్నారు. ఈ వేలం పాట‌ల వ‌ల్ల ల‌డ్డు పొందిన వారికి పుణ్యం ద‌క్క‌డంతో పాటు మండ‌పాల నిర్వాహ‌ణ‌కు ఎంతో స‌హ‌కారం అందించిన వార‌మ‌వుతామ‌ని అన్నారు.

సుప్ర‌జ ప్ర‌వీణ్‌కు ల‌డ్డును అంద‌జేస్తున్న తుల్జ‌భ‌వానీ యూత్ స‌భ్యులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here