నేతాజీ నగర్ వెల్ఫేర్ గణనాథుడికి ఘ‌నంగా అన్న‌స‌మారాధ‌న

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని ఆదివారం పలువురు ప్రముఖులు సందర్శించారు. విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అతిథులకు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు భేరి రాంచందర్ యాదవ్ శాలువాలతో సత్కరించారు. చందానగర్ సీఐ క్యాస్ట్రో రెడ్డి, ఎస్ ఐ హైమద్ బాషా, బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ నంద కుమార్ యాదవ్, కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి,‌ కంటెస్టెడ్ కార్పొరేటర్ ఎల్లేష్,హోఫ్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అన్నదానానికి సహకరించిన సత్యనారాయణ ముదిరాజ్, అంకం రావు, మేస్త్రి శ్రీనివాస్ తదితరులకు భేరి రాంచందర్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా బంజారా సమితి జిల్లా అధ్యక్షుడు హనుమంతు నాయక్, జిల్లా అర్బన్ కార్యదర్శి వరలక్ష్మి, ధీరజ్ , ప్రకాష్ నాయక్ నర్సింగ్ నాయక్, రాంచందర్ రెడ్డి, పుట్ట వినయ్ కుమార్ గౌడ్, కృష్ణ, విజయ్, కుమార్, మహిళా నాయకురాలు రామేశ్వరమ్మ, పద్మమ్మ, గంగమ్మ, రాధ, రాణి, శారద, బుచ్చయ్య యాదవ్, నరసింహ యాదవ్, ప్రభాకర్, శ్రీనివాస్, ఎం మహేష్, టీ. కుమార్ ముదిరాజ్ తదితరులు ఉన్నారు.

సీఐ‌ క్యాస్ట్రో రెడ్టిని సన్మానిస్తున్న భేరి రాంచందర్ యాదవ్

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here