నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ వీధి వ్యాపారులు సంక్షేమ సంఘం ఏర్పాటైంది. సంఘం గౌరవ అధ్యక్షులుగా పల్లె మురళి, కార్యదర్శిగా మిద్దెల రాజ శేఖర్, సహాయ కార్యదర్శిగా రాజేష్, అధ్యక్షులుగా అంగడి రామకృష్ణ, ఉపాధ్యక్షులుగా సురేష్ నాయుడు, కోశాధికారిగా వెంకటేశ్వర్లు, సభ్యులుగా అబ్రహం, హనుమంత్ రావు, వెంకట కోటయ్య, రాము, శాంతయ్య, వెంకటేశ్వర రావులు నియమితులయ్యారు. ఈ సందర్భంగా సంఘం గౌరవ అధ్యక్షుడు పల్లె మురళి మాట్లాడుతూ వీధి వ్యాపారుల హక్కులకై పోరాటాలు చేయడం కొరకు ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు తెలిపారు. వారి కష్టసుఖాల్లో భాగస్వామ్యమయ్యేలా సంఘం విదివిధానాలు రూపొందించుకుని ముందుకుసాగుతామని తెలిపారు.