నమస్తే శేరిలింగంపల్లి: ఆడపడుచులు ఆనందోత్సవాల మధ్య జరుపుకునే ఏకైక పండగ బతుకమ్మ పండుగ అని హఫీజ్ పేట్ డివిజన్ కార్పొరేటర్ పూజితజగదీశ్వర్ గౌడ్ పేర్కొన్నారు. బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా గురువారం సద్దుల బతుకమ్మ వేడుకలను నల్లగండ్లలోని స్వగృహంలో కార్పొరేటర్లు పూజితజగదీశ్వర్ గౌడ్ దంపతులు ఘనంగా నిర్వహించారు. మహిళలతో కలిసి భక్తిశ్రద్ధలతో గౌరమ్మను పూజించి బతుకమ్మను ఆడారు. ఈ కార్యక్రమంలో శ్రీ కృష్ణ యూత్, జగదీష్ యువ సంఘటన సభ్యులు కవిత, సంధ్య, లక్ష్మి, శైలు, రాధిక, ఐశ్వర్య, నాగలక్ష్మి మహిళలు పాల్గొన్నారు.