టీఆర్ఎస్ ఫ్లీనరీ ఏర్పాట్లపై ఆయా కమిటీ సభ్యుల సమీక్ష సమావేశం

నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది వేడుకల్లో భాగంగా ఈ నెల 25న నిర్వహించే ప్లీనరీ సమావేశం ఏర్పాట్ల పై మంత్రి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఆహ్వాన కమిటీ సభ్యులతో పాటు ఆయా కమిటీల సభ్యులు శనివారం ట్రాఫిక్, జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్లీనరీ సమావేశానికి వచ్చే ప్రజా ప్రతినిధుల కోసం చేస్తున్న ఏర్పాట్లతో పాటు అలంకరణ, భోజనం తదితర ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేసేలా చూడాలన్నారు. సభా వేధిక, సమావేశానికి వచ్చే వారి కోసం పార్కింగ్ ఏర్పాట్లు, ట్రాఫిక్ సమస్య లేకుండా, ప్రజలకు ఇబ్బందులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి పలు అంశాల మీద చర్చించారు. ప్లీనరీకి వచ్చే ప్రజా ప్రతినిధులు, నాయకులకు ఎటువంటి ఇబ్బందీ కలగకుండా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. నిర్ణీత కాలానికి ముందే ఏర్పాట్లన్నీ పూర్తి కావాలని సంబంధిత ఇంచార్జీ లకు సూచించారు. అలాగే అధికారులు, పోలీస్ ల పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద పలు సూచనలు చేశారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, ఎమ్మెల్సీ నవీన్ రావు, ఎమ్మెల్సీ శంబీపుర్ రాజు, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, సివిల్ సప్లై చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేశ్, స్థానిక కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్, జీహెచ్ఎంసీ మాదాపూర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎరగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు ఎం.డి గౌస్, వార్డ్ సభ్యులు రాంచందర్, జీ.శ్రీనివాస్, నాయకులు తైలి కృష్ణ, కేశవులు, రంగస్వామి, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం ఏర్పాట్లను పరిశీలిస్తున్న నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here