నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మసీద్ బండ, శ్రీరాంనగర్ కు చెందిన జలనిధి రజక సేవా సంఘం సభ్యులు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ను గురువారం మర్యాద పూర్వకంగా వార్డు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలను కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేలా చూస్తానని చెప్పారు. జలనిధి రజక సంఘం సభ్యులు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ గోపీనగర్ బస్తీ కమిటీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, టీఆర్ఎస్వీ నాయకుడు రవికిరణ్, జలనిధి సంఘం ప్రెసిడెంట్ జగదీష్, వైస్ ప్రెసిడెంట్ పెద్దిరాజు, సెక్రటరీలు వెంకట్రావు, తాతారావు, శ్రీనివాస్, సభ్యులు రాఘవ, సింహాచలం, సతీష్, సుంకయ్య, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.