నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్‌లోని విశాఖ శ్రీ శారదా పీఠపాలిత వెంకటేశ్వరాలయ సముదాయంలో గత ఆరు రోజులుగా వైభవంగా కొనసాగుతున్న శ్రీవారి 26వ వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారంతో ఘనంగా ముగిసాయి. ముగింపు ఉత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారికి ఉత్సవాస్తస్నపనము, విశేషపూజ, హరతి సాయంత్రం పుష్పకవాహన సేవ, పుష్పయాగం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఆలయ ప్రధానార్చకులు శ్రీ సుదర్శనం సత్యసాయి దంపతులకు విశేష సత్కారం…
ఆరు రోజుల పాటు బ్రహ్మోత్సవాల విజయవంతం కోసం అనుక్షణం కృషి చేసిన ఆలయ ప్రధానార్చకులు శ్రీ సుదర్శనం సత్యసాయి ఆచార్యుల దంపతులను ఉత్సవాల ధీక్ష భక్తుడు, ఆలయ కమిటి ఉప కార్యదర్శి కె.దేవేందర్‌రెడ్డి భార్గవి దంపతులు విశేష సత్కారం చేశారు. ప్రత్యేకంగా తయారు చేయించిన పూల శాలువా, కిరీటం, చక్రంలతో ఘనంగా సన్మానించారు.
అదేవిధంగా ఋత్వికులకు, దాతలను ఆలయ కమిటీ అధ్యక్షుడు కె. రఘుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి తూడి సుభాష్, ఉపాధ్యక్షులు తోట సుబ్బారాయుడు, పి.అశోక్‌గౌడ్, ఉపకార్యదర్శి కె.దేవేందర్ రెడ్డి, సభ్యులు వెంకట శేషయ్య, నాగేశ్వర్‌రావు, బ్రహ్మయ్య గుప్త, రాంగోపాల్, శ్రీకాంత్‌లు ఘనంగా సన్మానించారు. బ్రహ్మోత్సవాల విజయవంతంలో భాగస్వాములైన భక్తులు, సేవా సమితి సభ్యులకు వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.