నాణ్యతా ప్రమాణాలతో చెరువు సుందీరకరణ పనులు చేపట్టండి

  • అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : చెరువు సుందరీకరణ, అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అధికారులను ఆదేశించారు. చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తి శ్రీ నగర్ కాలనీలోని రేగుల కుంట చెరువు సుందరీకరణలో భాగంగా సేల్స్ ఫోర్స్ ఐటీ కంపెనీ సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా స్వచ్ఛందంగా రూ. 1 కోటి 50 లక్షల అంచనావ్యయంతో చేపడుతున్న సుందరీకరణ పనులను, అభివృద్ధి పనులను ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ రేగులకుంట చెరువుకు దశ దిశ మారిందని, ఎన్నో ఏండ్ల సమస్య నేటితో తీరునని, శాశ్వత పరిష్కారం దిశగా చెరువును అభివృద్ధి చేపడుతున్నట్లు తెలిపారు.

రేగుల కుంట చెరువు వద్ద చేపడుతున్న పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

మురికి కూపంలాంటి చెరువు స్వచ్ఛమైన తాగునీటి చెరువును తీర్చిదిద్దడమే ధ్యేయమని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు. సేల్స్ ఫోర్స్ ఐటీ కంపెనీ సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా సుందరీకరణ చేపట్టుటకు ముందుకు రావడం చాలా అభినదించదగ్గ విషయమని, సమాజ హితం, సమాజ సేవ చేయడం కోసం ముందుకు రావడం చాలా గర్వించదగ్గ విషయమని, సాఫ్ట్ వేర్ సంస్థ ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు ఎమ్మెల్యే గాంధీ తెలిపారు.

రేగుల కుంట చెరువు సుందరీకరణలో భాగంగా చేపడుతున్న పనులను పరిశీలించి మరింత నాణ్యతతో పనులు చేపట్టాలని అధికారులను ఆదేశిస్తున్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు డీఈ నళిని, ఏఈ పావని, సేల్స్ ఫోర్స్ ఐటీ కంపెని ప్రతినిధులు చైతన్య తాళ్ళూరి, రాము, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు రామ రాజు, కాశినాథ్ యాదవ్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here