కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
నమస్తే శేరిలింగంపల్లి : నమస్తే శేరిలింగంపల్లి : కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తెలిపారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని డాక్టర్స్ రెడ్డీస్ కాలనీలోని పలు సమస్యలు, చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనులపై జీహెచ్ఎంసి అధికారులు, ఈఈ శ్రీక్రంతిని, స్థానిక నాయకులు, కాలనీ వాసులతో కలసి పాదయాత్ర చేశారు.
ఈ సందర్బంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ కాలనీలలో నూతనంగా నిర్మాణం చేసిన యూజీడీ, సీసీ రోడ్ల అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని, పనుల్లో జాప్యం లేకుండా త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు జ్ఞానశేఖర్, ప్రతాపరెడ్డి, శ్రీకాంత్, భారతి, శివ్వయ్య, స్వామీ నాయక్, నరేష్ నాయక్, వర్క్ ఇన్స్పెక్టర్ నవీన్, లింగయ్య పాల్గొన్నారు.