నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ పరిధిలోని డి.కే ఎన్ క్లేవ్ కాలనీలో నూతన సిసి రోడ్ల నిర్మాణ పనులను స్థానిక నాయకులతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ డి. కే ఎన్ క్లేవ్ కాలనీలో మౌళికవసతులు కల్పించడమే ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని, డి కే ఎనక్లేవ్ కాలనీలో పలు అభివృద్ధి పనులను, సమస్యలను పరిశీలించానని తెలిపారు.
కాలనీవాసులకు అందుబాటులో ఉంటూ రోడ్లు, డ్రైనేజి, మంచినీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, ఎమ్మెల్యే ఆరేకపూడి గాంధీ సహకారంతో, డివిజన్ పరిధిలో మంజూరైన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు రాంబాబు గారు, విజయ్, సుధాకర్ , కిరణ్ పాల్గొన్నారు.