నమస్తే శేరిలింగంపల్లి:మాదాపూర్ శిల్పారామంలో నిర్వహిస్తున్న నేషనల్ హ్యాండ్లూమ్ ఎక్స్ పో లో చేనేత వస్త్రాల స్టాల్స్ మహిళలను ఆకట్టుకుంటున్నాయి. అందులో భాగంగా సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. వెంకట నళిని శిష్య బృందం చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. ఆనంద నర్తన గణపతిమ్ , వచ్చెను అలివేలు మంగ , శంకర శ్రీ గిరి, ఒకపరి కొకపరి, అర్పణం, ముద్దుగారేయ్ యశోద, శివతాండవం, పలుకు తేనెల్ల తల్లి , ఎవడెయ్ వాడు పదం, మొదలైన అంశాలను కృష్ణవేణి, నళిని, దామిని, నవ్య నందిని నృత్యప్రదర్శన చేసి మెప్పించారు.