శేరిలింగంపల్లి, అక్టోబర్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): విద్యుత్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మియాపూర్‌లోని మదీనాగూడ ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలనీలో నివాసం ఉంటున్న పుష్ప అనే మహిళ భర్త మహేంద్ర భాటి (36) స్థానికంగా సీసీటీవీ ఇన్‌స్టాలేషన్ హెల్పర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా ఈ నెల 23వ తేదీన ఉదయం తన ఇంటి సమీపంలో మహేంద్ర విద్యుత్ షాక్ తగిలి అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని అతని భార్య పుష్ప గమనించి వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న శ్రీకర హాస్పిటల్‌కు తరలించారు. కాగా అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందాడని నిర్దారించారు. ఈ మేరకు సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.






