శేరిలింగంపల్లి, అక్టోబర్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్‌లోని సరస్వతి విద్యా మందిర్ పాఠశాలలో సేవాభావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీరంగం ఫౌండేషన్ తరఫున ఇందుమతి సత్యం శ్రీరంగం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆమెతో పాటు జయంతి రెడ్డి, శ్రీవిద్య, సవిత యాదగిరి, అమరేశ్వరి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులను ఉద్దేశించి ఇందు శ్రీరంగం మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమాజ నిర్మాణానికి మూలస్తంభాలని, వారినుండి నేర్చుకుంటూ ప్రతి విద్యార్థి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని అన్నారు. అనంతరం ఉపాధ్యాయులకి వస్త్రాలను బహుకరించారు. అనంతరం వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల జాయింట్ సెక్రటరీ రామచంద్రారెడ్డి, ట్రెజరర్ నాగభూషణరావు, సభ్యుడు సుదీప్ రెడ్డి, దుర్గామహేశ్వర, హెచ్.ఎమ్. అరుణ పాల్గొన్నారు.






