చెరువులో ప‌డి బాలుడి మృతి

మియాపూర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప్ర‌మాదావ‌శాత్తూ చెరువు‌లో ప‌డి ఓ బాలుడు మృతి చెందాడు. మియాపూర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకున్న ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు తెలిపిన ప్ర‌కారం వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి. మియాపూర్‌లోని టీఎన్ న‌గ‌ర్‌లో నివాసం ఉండే కుషె చంద్ర‌కాంత్ కుమారుడు కుషె ఆద‌ర్శ్ (8) స్థానికంగా ఉన్న ప‌టేల్ చెరువు వ‌ద్ద త‌న తోటి స్నేహితుల‌తో క‌లిసి ఆడుకుంటున్నాడు. చెరువు స‌మీపంలో ఉండి ఆడుకుంటుండ‌గా అత‌ను ఒక్క‌సారిగా ప్ర‌మాద‌వ‌శాత్తూ అనుకోకుండా చెరువులో ప‌డిపోయాడు. దీంతో విష‌యాన్ని అత‌ని స్నేహితులు అత‌ని కుటుంబ స‌భ్యుల‌కు తెలియ‌జేశారు. ఈ క్ర‌మంలో చెరువులో ప‌డిన బాలున్ని బ‌య‌టికి తీసి చికిత్స నిమిత్తం శ్రీ‌క‌ర హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. అక్క‌డి నుంచి మెరుగైన వైద్యం కోసం అంకుర హాస్పిట‌ల్‌కు ఆద‌ర్శ్ ను త‌ర‌లించారు. కాగా అప్ప‌టికే అత‌ను చ‌నిపోయాడ‌ని వైద్యులు తెలిపారు. ఈ మేర‌కు ఆద‌ర్శ్ కుటుంబ స‌భ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

ఆద‌ర్శ్ (ఫైల్‌)

ప్రభుత్వ నిర్లక్షమే బాలుడి మృతికి కారణం:ఎంసీపీఐ(యూ)
పటేల్ చెరువు సుందరీకరణ పేరుతో కందకం తవ్వి వదిలేయడంతో ప్రమాదాలకు కారణం అవుతుందని, ఈ క్రమంలోనే ఆదర్శ్ కందకం లో పడి మృతి చెందాడని ఎంసిపిఐ(యు) మండిపడింది. ఆదర్శ్ మృత్తికి ప్రభుత్వమే బాధ్యత వహించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని ఆ పార్టీ నాయకుడు పల్లె మురళి డిమాండ్ చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here