వరంగల్‌ అర్బన్‌ జిల్లా సగర (ఉప్పర) సంఘం కార్య‌వ‌ర్గం ఎన్నిక

వరంగల్‌ అర్బన్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): వరంగల్‌ అర్బన్‌ జిల్లా సగర (ఉప్పర) సంఘం జిల్లా ఎన్నికలను హన్మకొండలోని కుమార్‌పల్లిలో ఉన్న జిల్లా సగర భవనంలో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సగర (ఉప్పర) సంఘం అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ స‌గ‌ర‌‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వరంగల్‌ అర్బన్‌ జిల్లా సగర (ఉప్పర) సంఘం జిల్లా అధ్యక్షుడిగా పొట్లపెల్లి సురేష్‌, ప్రధాన కార్యదర్శి వేముల రమేష్‌, కోశాధికారిగా వాసులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

నూత‌నంగా ఎన్నికైన నాయకుల‌కు నియామ‌క ప‌త్రాల‌ను అందజేస్తున్న రాష్ట్ర సగర (ఉప్పర) సంఘం అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ స‌గ‌ర

ఈ సందర్భంగా ఉప్పరి శేఖర్‌ సగర మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌ కోకాపేటలో బీసీలకు ఆత్మగౌరవ భవనాలను కేటాయిస్తూ సగరులకు 2 ఎకరాలు ఇచ్చిన స్థలాన్ని మార్చి క్రిస్టియన్లకు కేటాయించడాన్ని ఖండించారు. సగరులకు కేటాయించిన స్థలాన్ని ఇవ్వకపోతే త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సగరులతో కలిసి ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సగర సంఘం ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సగర, కోశాధికారి భిక్షపతి సగర, రాష్ట్ర యువజన సంఘం ప్రధాన కార్యదర్శి మర్క సురేష్‌ సగర, ట్రస్ట్‌ బోర్డు గౌరవ అధ్యక్షుడు సీత భద్రయ్య, ట్రస్ట్‌ బోర్డు అధ్యక్షుడు సీత కమలాకర్‌ రావు, జిల్లా సగర సంఘం మాజీ అధ్యక్షుడు కానిగంటి రవి, బస్తీ సంఘాల ప్రతినిధులు, శ్రీను, సీత రమేష్, తాడిశెట్టి జగదీష్‌, నలుబోల సతీష్, అనిశెట్టి రంజిత్‌, కురుమాళ్ల సదానందం, అనిశెట్టి రామకృష్ణ, సతీష్, హేమలత, స్వప్న, మల్లికాంబ, పోచంపల్లి మల్లేశం, పూర్ణచందర్‌, రాజేష్‌ ఖన్నా పాల్గొన్నారు.

కార్య‌క్ర‌మంలో మాట్లాడుతున్న ఉప్పరి శేఖర్ స‌గ‌ర
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here