శేరిలింగంపల్లి, నవంబర్ 29 (నమస్తే శేరిలింగంపల్లి): గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం పోలీసులకు లభ్యమైంది. శేరిలింగంపల్లి నియోజకరవ్గం పరిధిలోని గోపన్‌పల్లి తండా చెరువు వద్ద చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గోపన్‌పల్లి తండా చెరువులో తీరం నుంచి 10 మీటర్ల దూరంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం నీటిలో తేలుతుందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడు క్రీమ్ కలర్ టీ షర్ట్, ఖాకి కలర్ ప్యాంట్ ధరించి ఉన్నాడని, అతని ఎత్తు సుమారుగా 5.5 అడుగులు ఉంటుందని తెలిపారు. ఎవరైనా గుర్తు పట్టదలిస్తే పోలీసులను సంప్రదించాలని కోరారు.