తెలంగాణ‌లో టీడీపీ బ‌లోపేతం అవుతుంది: బ‌క్క‌ని న‌ర‌సింహులు

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 29 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలుగుదేశం పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు, పోలిట్ బ్యూరో సభ్యుడు బక్కని నరసింహులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేక 20 సంవత్సరాల అవుతున్నా తెలుగుదేశం పార్టీకి ప్రజల మీద ఉన్న అభిమానం తెలియజేయడానికి ఇదే నిదర్శనం అని అన్నారు. తెలుగుదేశం పార్టీ వంద రూపాయ‌ల సభ్యత్వం తీసుకున్న సభ్యులు తెలంగాణలో 510 మంది మరణిస్తే ఒక్కొక్క కుటుంబానికి రెండు లక్షల చొప్పున 10 కోట్ల 20 లక్షలు ఇచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు.

విలేకరుల స‌మావేశంలో మాట్లాడుతున్న బ‌క్క‌ని న‌ర‌సింహులు

కార్యకర్తలు మరణించిన వారికి 86 లక్షలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. ఎంతో మంది విద్యార్థుల‌కు సైతం త‌మ పార్టీ స‌హాయం చేస్తుంద‌ని అన్నారు. 2022 నుంచి 2024 మ‌ధ్య తెలంగాణ‌లో స‌భ్య‌త్వం 30వేలుగా ఉంద‌ని, కానీ ప్ర‌స్తుతం 53వేలు దాటింద‌ని అన్నారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో పార్టీని తెలంగాణ‌లో మ‌రింత బ‌లోపేతం చేస్తామ‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో టీడీపీ పార్ల‌మెంట్ క‌న్వీన‌ర్ ప‌ట్టా వెంక‌టేష్ గౌడ్‌, చేవెళ్ల పార్ల‌మెంట్ అడ్‌హ‌క్ క‌మిటీ సభ్యుడు గూడెం రాఘ‌వులు, త‌మోద‌న రావు, బీఎస్ఎన్ కిశోర్ కుమార్ యాద‌వ్‌, ఏరువ సాంబ‌శివ గౌడ్‌, టి.గౌత‌మ్‌, ఆనంద్ గుడిపాటి, నాని, కార్య‌క‌ర్త‌లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here