శేరిలింగంపల్లి, అక్టోబర్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం చందానగర్ పోలీసులకు లభ్యమైంది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. శేరిలింగంపల్లిలోని లింగంపల్లి రైల్వే స్టేషన్ రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ఓ వ్యక్తి మృతదేహం పడి ఉందన్న సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా చనిపోయిన వ్యక్తి యాచకుడు అయి ఉంటాడని, అతను గత కొంత కాలంగా ఆహారం, నీరు తీసుకోకపోవడంతో ఆకలి, అనారోగ్యం కారణంగా మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఎవరైనా గుర్తు పట్టదలిస్తే తమను సంప్రదించాలని వారు సూచించారు.






