శేరిలింగంపల్లి, అక్టోబర్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్తున్న వోల్వో బస్ కర్నూల్ వద్ద దగ్ధం అయిన ప్రమాదంలో గాయపడిన మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రజా షెల్టర్ అపార్ట్మెంట్స్ నివాసితుడైన సూర్యను స్థానిక నాయకులు, అపార్ట్మెంట్స్ అసోసియేషన్ సభ్యులతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరామర్శించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ బస్ ప్రమాదంలో గాయపడిన సూర్యను స్థానిక నాయకులతో కలిసి పరామర్శించడం జరిగిందని, ప్రమాద సమయంలో సూర్య తనకు గాయాలు అయినా తోటి వారిని కాపాడినందుకు సూర్యను అభినందించారు, వారిని రక్షించే సమయంలో తన రెండు కళ్ళకు గాయాలు అయ్యాయని, సరైన వైద్యం తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం తరపున సూర్యకు కావలసిన సహాయ సహకారాలు అందిస్తామని కార్పొరేటర్ శ్రీకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ప్రతాప్ రెడ్డి, దామోదర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, కాసర్ల శ్రీనివాస్, గోపాల కృష్ణ, శివారెడ్డి, శంకర్, శివయ్య, శివ ముదిరాజ్, రాయుడు, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.






