శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 20 (నమస్తే శేరిలింగంపల్లి): ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం మియాపూర్ పోలీసులకు లభ్యమైంది. పోలీసులు తెలిపిన ప్రకారం ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. హఫీజ్‌పేటలోని ఆదిత్యనగర్ హోటల్ జీషన్ ఎదురుగా ఓ వ్యక్తి మృతదేహం పడి ఉందన్న సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియలేదని, అతను అనుమానాస్పద స్థితిలో చనిపోయాడని, వయస్సు సుమారుగా 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉంటుందని తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.