శేరిలింగంపల్లి, జనవరి 5 (నమస్తే శేరిలింగంపల్లి): ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం ఈ సంఘటనకు సంబంధించి. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. హఫీజ్‌పేట రైల్వే స్టేషన్ సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం పడిఉందన్న సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తలపై సిమెంట్ ఇటుకలతో దాడి చేయడంతో తీవ్ర గాయాలకు గురై బాధితుడు అక్కడికక్కడే మృతి చెంది ఉంటాడని పోలీసులు తెలిపారు. అతని వయస్సు సుమారుగా 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉంటుందని, ఎత్తు 5 అడుగుల 5 అంగుళాలు ఉంటాడని, బ్లాక్ జాకెట్, వైట్ షర్ట్, బ్లూ జీన్స్ ధరించి ఉన్నాడని, కుడి వైపు నుదురుపై లవ్ సింబల్ టాటూ ఉందని, ఎవరైనా గుర్తు పట్టదలిస్తే తమను సంప్రదించాలని పోలీసులు తెలిపారు.