శేరిలింగంపల్లి, అక్టోబర్ 11 (నమస్తే శేరిలింగంపల్లి): ఓ గుర్తు తెలియని వ్యక్తి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. లింగంపల్లి రైల్వే స్టేషన్ లో 6వ నంబర్ ప్లాట్ ఫాం పై ఈ నెల 9వ తేదీన ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడన్న సమాచారం అందుకున్న చందానగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అతన్ని చికిత్స నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. కాగా ఆ వ్యక్తి చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆ వ్యక్తికి బహుశా 45 నుంచి 50 ఏళ్ల వయస్సు ఉంటుందని, స్థానికంగా భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడని, ఎవరైనా గుర్తు పట్టదలిస్తే చందానగర్ పోలీసులను 9490617118,8712663184 అనే ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.






