శేరిలింగంపల్లి, అక్టోబర్ 11 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని నల్లగండ్ల అపర్ణ commune, అపర్ణ జోన్, మంజీరా డైమండ్, అపర్ణ లైఫ్, అపర్ణ జినీత్, అపర్ణ సరోవర్ వాసులతో చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, శేరిలింగంపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ చిట్ చాట్ కార్యక్రమం నిర్వహించారు. గేటెడ్ కమ్యూనిటీ వాసులతో ప్రత్యేక సమావేశమై వారితో చిట్ చాట్ నిర్వహించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గేటెడ్ కమ్యూనిటీ వాసులు నియోజకవర్గంలో నెలకొన్న కొన్ని ముఖ్యమైన అంశాలను లేవనెత్తుతూ అందులో ముఖ్యమైనవి తెలిపారని, ట్రాఫిక్ సమస్యలు, లేక్ సమస్యలు, రోడ్లు, డ్రైనేజీలు, వాతావరణ పొల్యూషన్, సరైన విద్య, ఆరోగ్యం పట్ల కేంద్ర ప్రభుత్వం దృష్టి సాధించాలని కమిటీ వాసులు కోరారు. ఇందుకు వారు సానుకూలంగా స్పందించి నేటి సమాజంలో ఇతరుల సౌకర్యాల కోసం ఆలోచించడం అరుదుగా ఉంటుంది, కానీ కాలనీవాసులు సమాజం బాగుకోసం, సమాజంలో మార్పు తీసుకురావడం కోసం సూచించిన సూచనలు, లేవనెత్తిన సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి పార్లమెంటులో లేవనెత్తుతానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. స్థానికంగా సమస్యలును తన దృష్టికి తీసుకువచ్చినట్లయితే స్థానిక అధికారులతో, స్థానిక పార్లమెంటు సభ్యుడితో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని రవికుమార్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గేటెడ్ కమ్యూనిటీ అధ్యక్షులు, మహిపాల్ రెడ్డి , రాధాకృష్ణ యాదవ్ , వసంత్ యాదవ్, శివా సింగ్ , వరలక్ష్మి, వినీత సింగ్ తదితరులు పాల్గొన్నారు.






