- 60 యేళ్లు పైబడిన, అనారోగ్యంతో ఉన్న 45-59 వయస్కుల వారికి
- ప్రతీ కేంద్రంలో రోజుకు 200 మందికి
- కోవిన్ యాప్ ద్వారా పేర్ల నమోదు
నమస్తే శేరిలింగంపల్లి: కోవిడ్ వ్యాక్సిన్ దేశంలో విడుదల చేసిన అనంతరం ముందుగా కరోనా వారియర్స్‌కు వ్యాక్సినేషన్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రెండవ దశ వ్యాక్సినేషన్ లో భాగంగా 60యేళ్లు పైబడిన వారితో పటు పలు ఆరోగ్య సమస్యలు గల 45-59 వయస్కులకు మార్చి 1వ తేదీ నుండి కోవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 91 కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగరంలో 24 కేంద్రాలు ఉండగా, ప్రతీ కేంద్రంలో రోజుకు 200 మందికి వ్యాక్సినేషన్ చేయనున్నారు. వ్యాక్సిన్ వేయించుకోవాలనుకున్నవారు (COWIN) యాప్ ద్వారా తమ పేర్లు నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా సరఫరా చేస్తుండగా ప్రైవేటు ఆసుపత్రులలో రూ. 250 లుగా వ్యాక్సినేషన్ ధరను ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
నగరంలోని కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలు…
గాంధీ హస్పిటల్, ఉస్మానియా జనరల్ ఆసుప్రతి, ఫీవర్ హాస్పిటనల్, ఈఎన్‌టి హాస్పిటల్, ఎస్.డి.కంటి ఆసుపత్రి, డిహెచ్ కింగ్‌కోఠి, ఏరియా ఆసుపత్రి మలక్‌పేట్, ఏరియా ఆసుప్రతి గోల్కొండ, ఏరియా ఆసుపత్రి నాంపల్లి, పాల్దార్ యూపిహెచ్‌సి, నిజామియా టిబి ఆసుపత్రి, ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుప్రతి, అపోలో హాస్పిటల్ జూబ్లీహిల్స్, అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్, యశోద హాస్పిటల్ సికిందరాబాద్, ప్రిన్సెస్ ఎస్రా హాస్పిటల్, యశోద హాస్పిటల్ సోమాజిగూడ, మెడికోవర్ హాస్పిటల్ సెక్రటేరియట్, ప్రతిమ హాస్పిటల్స్, కేర్ హాస్పిటల్ నాంపల్లి, సెంచరీ హాస్పిటల్, క్రిష్ణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, కేర్ హాస్పిటల్ బంజారాహిల్స్.