గచ్చిబౌలి(నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి ఘోర్ బంజారా తండాలో గల మేరమ్మ యాడి, సేవాలాల్ మహారాజ్ దేవాలయ నూతన కమిటీని తండావాసులు ఎన్నుకున్నారు. ఆదివారం తండాలో నిర్వహించిన సమావేశంలో కమిటీ అధ్యక్షుడిగా సబావత్ రాజునాయక్ ను ఏకగ్రీవంగా నియమించారు. ఈ సందర్బంగా రాజునాయక్ మాట్లాడుతూ దేవాలయ అభివృద్దితో పాటు తండావాసుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, త్వరలోనే గుడి నిర్మాణం జరిగేలా ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో ముందుకు సాగుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తండా పెద్దలు హనుమంతునాయక్, ఎన్.బద్దు, ఎన్.ఫూల్‌సింగ్, ఎన్.రాములు, ఎన్.రాజు, ఎన్.రాజ్‌కుమార్, పి.రాజు, ఎన్.పాండు, ఎన్.బాబు, ఎస్.శ్రీరామ్, డా.రమేష్, ఏ.రాములు, ఏ.రాణి, ఎ.తావర్యా, వలిబాయ్, బంజారా యువజనసంఘం అధ్యక్షుడు సురేష్ బడావత్, సభ్యులు ఎన్.మోహన్, ఎన్.హనుమంతు, కె.రాకేష్, రాజా, దుర్గేష్, గోవర్ధన్, ప్రవీణ్, సీతారామ్, విజయ, పవన్, ప్రకాష్, పాండురంగం, రవి తదితరులు పాల్గొన్నారు.
