- నీలిమ గ్రీన్స్ కాలనీ అసోసియేషన్ సభ్యులకు కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యుడు ఉప్పలపాటి శ్రీకాంత్ హామి
నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని నీలిమ గ్రీన్స్ కాలనీ అసోసియేషన్ సభ్యులు పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యుడు ఉప్పలపాటి శ్రీకాంత్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు ఆయన దృష్టికి పలు సమస్యలు తీసుకెళ్లగా కార్పొరేటర్ సానుకూలంగా స్పందించారు. కాలనీలో అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల నిర్మాణము పనులను పూర్తి చేయాలని, మంచి నీటి వసతిని మెరుగుపర్చాలని, యుజిడి పైప్ లైన్ నిర్మాణం పనులు చేపట్టాలని కార్పొరేటర్ శ్రీకాంత్ కి విన్నవించుకున్నారు.
కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ కాలనీ వాసులు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సహకారంతో కాలనీ లో నెలకొన్న అన్ని సమస్యలను దశల వారిగా పరిష్కరిస్తామని, కాలనీ లో అసంపూర్తిగా మిగిలిపోయిన యూజిడి పనులను, రోడ్లను త్వరితగతిన పూర్తి చేస్తామని, మంజీర మంచీ నీటి వసతిని మెరుగుపరుస్తామని, దశల వారిగా అన్ని పనులు పూర్తి చేసి కాలనీలో చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని, అన్నివేళలో ప్రజలకు అందుబాటులోకి ఉంటానని, మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని కార్పొరేటర్ శ్రీకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నీలిమ గ్రీన్స్ కాలనీ అసోసియేషన్ సభ్యులు రామారావు, శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మీ నారాయణ, భాగ్య, పాల్గొన్నారు.