నమస్తే శేరిలింగంపల్లి : హఫీజ్ పేట్ లో స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఆ డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ పాల్గొని మొక్కలు నాటారు.
ఆయనతోపాటు ఇన్చార్జి నాగరాజు, ఏ ఈ ప్రతాప్, శానిటేషన్ ఇన్చార్జి మహేష్ , ప్రసాద్, నాయకులు మనోహర్ గౌడ్ , అంజనెవర్మ , రాజు. గ్యాని, కాలనీ అసోసియేషన్ మెంబర్స్ డివిజన్ నాయకులు పాల్గొని హుడా కాలనీ ఫేస్ 1 , ఇంజనీర్ ఎంక్లేవ్ పరిసరాల్లో మొక్కలు నాటి, దోమల నివారణకు , నివారణ చర్యలు తలపెట్టి సంబంధిత సహజ ధోరణిలో మందులు చెరువులో చల్లడం చల్లారు. ప్రజలందరూ స్వచ్చందంగా ముందుకు వచ్చి తమ ఇంటి పరిసరాల్లో మొక్కలు నాటి తమ వంతు స్వచ్చధనం – పచ్చదనం కార్యక్రమాల్లో పాల్గొనాలని, మొక్కలు పంపిణీ చేసారు.