- స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభించిన గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డి లోనీ గచ్చిబౌలి డివిజన్ వార్డ్ కార్యాలయం ప్రాంగణంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మొక్కలు గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మొక్కలు నాటి మాట్లాడారు.
స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమం ద్వారా పట్టణ ప్రాంతాల్లో పరిశుభ్రత, పచ్చదనాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి స్వచ్ఛదనం -పచ్చదనం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని ప్రజలను, అధికారులను కోరారు. కాలనీ బస్తీలను సీజన్లలో వచ్చే వ్యాధుల పట్ల పరిశుభ్రంగా ఉంచుకోవడమే ఈ కార్యక్రమ ఉద్దేశమన్నారు. చుట్టూ పక్కల పరిశుభ్రత ఉంటేనే ఆరోగ్యం బాగుంటుందన్నారు.
వార్డులను, ఇండ్లలో పరిశుభ్రత పాటించాలని తెలిపారు. ఐదు రోజులు పాటు సాగేలా వివిధ ప్రణాళికలతో పాటు కాలనీ బస్తీలలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తెలిపారు. మానవ మనుగడకు పర్యావరణమే కీలకమని, పర్యావరణాన్ని కాపాడుకోవడానికి స్వచ్ఛదనం పచ్చదనం దోహదపడుతుందని అన్ని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందిస్తే వాతావరణ కాలుష్యం తగ్గి ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారన్నారు. భవిష్యత్ తరాలకు మనం ఇచ్చే ఆస్తి పర్యావరణాన్ని కాపాడటమేనని, ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ సంజయ్, డిఈ విసాలాక్షి, ఏఈ జగదీష్, వర్క్ ఇన్ స్పెక్టర్ లక్ష్మణ్, యాదయ్య, గచ్చిబౌలి డివిజన్ కిసాన్ మూర్చ అధ్యక్షులు కిషన్ గౌలీ, జిహెచ్ఎంసి ఎస్ఎఫ్ఏలు భారత్, రాందాస్, శ్రీనివాస్, కిష్టయ్య, రఘు, జవాన్, సీనియర్ నాయకులు నర్సింగ్ నాయక్, ప్రసాద్, శ్రీనివాస్ , రాజు, నర్సింగ్ రావు, యాదయ్య, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ జావేద్, కమ్యూనిటీ ఆర్గనైజర్ శ్రీకాంత్, టాక్ ఇన్ స్పెక్టర్ మురళీ, శ్రీనివాస్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.