ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : బీఆర్ఏస్ పార్టీ అభ్యర్థి ఆరికెపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని శంకర్ నగర్, శంకర్ నగర్ ఫేజ్ 1, శంకర్ నగర్ ఫేజ్ 2, న్యూ శంకర్ నగర్,భవానీ పురం, భవానీ పురం వీకర్ సెక్షన్ పలు కాలనీలలో బిఆర్ఏస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అనుబంధ సంఘాలతో కలిసి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ, చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని గెలిపించాలని కోరుతూ ప్రచారం చేపట్టిన కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి

కాలనిలో చేపట్టిన అభివృద్ధిని వివరిస్తూ ప్రజా సంక్షేమం బిఆర్ఏస్ పార్టీ మెనిఫేస్టో కరపత్రాలు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ తొమ్మిది సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అడుగుతున్నట్లు తెలిపారు.

ప్రచార కార్యక్రమంలో కార్పొరేటర్ మంజుల రఘునాథరెడ్డి, పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే గాంధీ

కార్యక్రమంలో చందానగర్ డివిజన్ బిఆర్ఏస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి,  రాఘవ రావు, రఘుపతిరెడ్డి, రవీందర్ రావు, లక్ష్మి నారాయణ గౌడ్, జనార్ధన్ రెడ్డి , గురుచరణ్ దూబె, పులిపాటి నాగరాజు, లక్ష్మా రెడ్డి, ధన లక్ష్మి, భవాని చౌదరి, వెంకట రావు, తుడి ప్రవీణ్, పబ్బ మల్లేష్, అక్బర్ ఖాన్, యూసఫ్, ఎల్లమయ్య, శ్రీకాంత్, నరేందర్ భల్లా, అంజాద్, రాజశేఖర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, దీక్షిత్ రెడ్డి, ఉదయ్, రాహుల్, యార్వ వెంకటేష్ కాలనీ వాసులు ప్రవీణ్, ధనుంజయ్, రమేష్, సుందర్, శ్రీనివాస రెడ్డి, మానయ్య, రాములు, కృష్ణారెడ్డి, కృష్ణ, నాగి రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here