నమస్తే శేరిలింగంపల్లి: మహిళా సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని మహిళా నేతలు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయంటూ.. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి విలేజ్ కి చెందిన మహిళలు శేరిలింగంపల్లి విలేజ్ డెవలప్ మెంట్ కమిటీ ప్రెసిడెంట్ గడ్డం రవి యాదవ్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సమక్షంలో పార్టీలో చేరగా వారిని సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో వనజ, ముత్యాలు, వేదవతి, అనిత, హరిత, స్రవంతి, రాజమణి, నీలమ్మ, లావణ్య, వసంత, నిర్మల, వరలక్ష్మి, సబిత ఉన్నారు.
కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్, డివిజన్ గౌరవ అధ్యక్షులు వీరేశం గౌడ్, మాజీ కౌన్సిలర్ రాజేశ్వరమ్మ, కటిక రాంచందర్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, గోపాల్ యాదవ్, దివాకర్ రెడ్డి, రవి కిరణ్ ఉన్నారు.