నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కేసీఆర్ తో, శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధి గాంధీతోనే సాధ్యమని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు.
కొండాపూర్ డివిజన్ పరిధిలోని గోపాల్ రెడ్డి నగర్, వీకర్ సెక్షన్ కాలనీ, శ్రీనివాస్ కాలనీ, రాజా రాజేశ్వరి కాలనీ, కొండాపూర్ ఓల్డ్ విలేజ్, సఫారీ నగర్, ప్రశాంత్ నగర్ లలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలసి కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ ప్రతి గడప గడపకు తిరిగి నేరుగా ఓటర్లను కలసి బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి, ఎమ్మెల్యే అభ్యర్థి గాంధీని అఖండ విజయంతో గెలిపించాలని అభ్యర్థించారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మళ్ళీ బీఆర్ఎస్ జెండా ఎగరటం ఖాయమని యువ జన నాయకులు ఆదిల్ పటేల్ తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో కార్పొరేటర్ హమీద్ పటేల్ తో బాటుగా మాజీ కార్పొరేటర్ నీలం రవీందర్ ముదిరాజ్ గారు, సీనియర్ నాయకులు ఊట్ల కృష్ణ గారు, యువ జన నాయకులు ఆదిల్ పటేల్ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కరీం లాలా, జె. బలరాం యాదవ్, కాకి నిర్మల, రూపారెడ్డి, గౌరీ, మీనా భి, శ్రీనివాస్ చౌదరి, మొహ్మద్ అలీ, షబ్బీర్ అలీ, బాబా, భీమని శ్రీనివాస్, రవి గౌడ్, రజనీకాంత్, తిరుపతి పటేల్, రవి శంకర్ నాయక్, అశోక్ సాగర్, గణపతి, గిరి గౌడ్, యాదగిరి, అబేద్ అలీ,నీలం లక్ష్మణ్, నీలం కుమార్, సత్తిబాబు, సాయి శామ్యూల్ కుమార్, దామోదర్, గోపి కృష్ణ, లావణ్య, రాజ శేఖర్, ఊట్ల లక్ష్మణ్, కచ్చావా దీపక్, శైలజ, అజ్జు, గిరి గౌడ్, సాయి కిరణ్, మణెమ్మ, దిలీప్, సయ్యద్ ఉస్మాన్, డా. సుదర్శన్, మొహ్మద్, తదితరులు పాల్గొన్నారు.