విద్యార్థులకు భోజనం, నోట్ పుస్తకాలు అందజేత

నమస్తే శేరిలింగంపల్లి : ఎంపీపీ స్కూల్లో హఫీజ్ పేట్ బిజెపి కంటెస్టెంట్ కార్పొరేటర్ బోయిని అనూష మహేష్ యాదవ్ జన్మదినం సందర్భంగా విద్యార్థులకు భోజన సదుపాయం, నోట్ పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి రాష్ట్ర నాయకుడు మువ్వా సత్యనారాయణ, మియాపూర్ కంటెస్టెడ్ కార్పొరేటర్ రాఘవేందర్ రావు విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేవాల్ యాదవ్, రామిశెట్టి రావు, సురేష్ యాదవ్, సైఫుల్ల ఖాన్, సలీం, శ్రీనివాస్ యాదవ్, రవి ముదిరాజు, అశోక్ నాయి, వినాయక రెడ్డి, సుబ్బారావు, నవీన్, రఘు, దినేష్, జానీ, శ్రీనివాస్, సురేఖ, స్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఎంపీపీ స్కూల్లో విద్యార్థులకు నోట్ పుస్తకాలను అందజేస్తున్న బిజెపి రాష్ట్ర నాయకుడు మువ్వా సత్యనారాయణ, బిజెపి కంటెస్టెంట్ కార్పొరేటర్ బోయిని అనూష మహేష్ యాదవ్, మియాపూర్ కంటెస్టెడ్ కార్పొరేటర్ రాఘవేందర్ రావు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here