మరింతగా అభివృద్ధి చేపడతాం : కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

  • రూ. 1 కోటి 20 లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్డు పనుల పరిశీలన
  • సమస్యల పరిష్కారానికి గౌలిదొడ్డిలో బస్తీబాట కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధి ఎన్టీఆర్ నగర్ కాలనీలో రూ. 1 కోటి 20 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను కాలనీ వాసులతో కలిసి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాణ్యతా విషయంలో రాజీ పడకుండా నిర్ణీత సమయంలో సీసీ రోడ్డులు పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు.

  • గౌలిదొడ్డిలో బస్తీబాట..

గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డిలో ప్రజా సమస్యలపై బస్తీ బాట నిర్వహించారు. ఇందులో భాగంగా కాలనీలో సమస్యల గురించి గచ్చిబౌలి కార్పొరోటర్ గంగాధర్ రెడ్డి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాలనీలో నెలకొన్న సమస్యలను గౌలిడొద్ది కాలనీ వాసులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్బంగా భూగర్భ డ్రైనేజి లైన్, సీసీ రోడ్డులు, వీధి దీపాల పనితీరుపై తనిఖీ చేశారు. అనంతరం జిహెచ్ఎంసి అధికారులతో భూగర్భ డ్రైనేజి లైన్, సిసి రోడ్లు, తాగునీరు, మురికి కాలువల పనుల గురించి చర్చించి సత్వరమే ఆ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఏడాదిన్నర వ్యవధిలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని, రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, జిహెచ్ఎంసి వర్క్ ఇన్ స్పెక్టర్ విశ్వనాథ, సీనియర్ నాయకులు, కృష్ణ నాయక్, అభిరామ్, ఎన్టీఆర్ నగర్ వాసులు పాల్గొన్నారు. కార్యక్రమాలలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, జిహెచ్ఎంసి వర్క్ ఇన్ స్పెక్టర్ విశ్వనాథ, సీనియర్ నాయకులు, కృష్ణ నాయక్, అభిరామ్, వెంకటేష్ యాదవ్, కృష్ణ, నర్సింహ, శ్రీశైలం, మోష, దర్గపల్లీ అనిల్,హరీష్ శంకర్ యాదవ్, కిషన్ గౌలి, ప్రసాద్, రాజు శ్రీను, యాదయ్య, నరేష్ యాదవ్, శానిటేషన్ సూపర్ వైసర్ కిష్టయ్య, రాందాస్,స్థానిక నేతలు, కాలనీ వాసులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ నగర్ వాసులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్ నగర్ కాలనీలో సీసీ రోడ్డు పనులు పరిశీలించేందుకు పర్యటిస్తున్న కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

గౌలిదొడ్డిలో నిర్వహించిన బస్తీ బాటలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here