- ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని హఫీజ్ పేట్ గ్రామంలో నాభిశిల( బొడ్రాయి) దేవుడి ప్రతిష్ఠాపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పూజిత జగదీశ్వర్ గౌడ్, జగదీశ్వర్ గౌడ్ , నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రత్యేక పూజలు చేశారు.

ఈ కార్యక్రమంలో హఫీజ్ పేట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ , బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంజీవ రెడ్డి, యాదగిరి గౌడ్, వెంకటేష్ గౌడ్, రామకృష్ణ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, మల్లేష్ గౌడ్, సాయి కృష్ణ గౌడ్, దర్శన్, జితేందర్ యాదవ్ , కొమురయ్య, గ్రామస్థులు పాల్గొన్నారు.
