నమస్తే శేరిలింగంపల్లి: ప్రజలకు ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉంటామని, ఏ సమస్య ఉన్న తమ దృష్టికి తెస్తే వెంటనే పరిష్కరిస్తామని స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకులు హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా మియాపూర్ ప్రజయ్ సిటీ అపార్ట్ మెంట్ లో స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొడాలి శ్రీధర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
అనంతరం వారు మాట్లాడారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను వెను వెంటనే పరిష్కరించడమే లక్ష్యంగా ప్రజల వద్దే పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, రవికుమార్, సూర్యనారాయణ, రత్నం, సుబ్బారావు, ప్రసాద్ రెడ్డి, కోటేశ్వరరావు, రామేశ్వర్ రెడ్డి, గోపి, నాగేశ్వరరావు, సతీష్ పాల్గొన్నారు.