నమస్తే శేరిలింగంపల్లి: నారా చంద్రబాబు నాయుడుకి రెగ్యులర్ బెయిల్ మంజూరు కావడంతో మియాపూర్ డివిజన్ ప్రశాంత్ నగర్ వీరాంజనేయ స్వామి ఆలయంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, కంటెస్టెడ్ ఎంఎల్ఏ మొవ్వా సత్యనారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్బంగా మొవ్వా సత్యనారాయణ మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడుపై ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టినా.. న్యాయస్థానంలో న్యాయం జరిగిందని, చివరకు నిజమే గెలిచిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బిఆర్ఎస్ నాయకులు, కమ్మ సంగం సభ్యులు, మహిళలు, నందమూరి తారక రామారావు అభిమానులు, చంద్రబాబు నాయుడు అభిమానులు పాల్గొన్నారు.