నమస్తే శేరిలింగంపల్లి : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనకు మెచ్చి పలు పార్టీల నాయకులు ఆ పార్టీలో స్వచ్ఛందంగా చేరుతున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు సయ్యద్ బాబా ఆధ్వర్యంలో పలువురు పార్టీలో చేరగా.. వారికి శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్, టీపీసీసీ లేబర్ సెల్ చైర్మన్ నల్ల సంజీవ రెడ్డి , జాయింట్ సెక్రటరీ ఎం.తిరుపతి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు వి.వీరేందర్ గౌడ్, ఉపాధ్యక్షులు పి.దినేష్ రాజ్, నాయకులు మనెపల్లి సాంబశివరావు, పల్లపు సురేందర్, వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు బాష్పక యాదగిరి, ప్రభాకర్, గోపాల్, నర్సింహ రాజు, కిరణ్, జగదీశ్, గోపాల్ నాయక మహిళలు అస్మా, రిజ్వాన, షేనాసా, సమీరా, సలమ, ఆశ బేగం, ఆసరా, తస్లీమ్, మీనా, సారా పాల్గొన్నారు.