నమస్తే శేరిలింగంపల్లి: కాంగ్రెస్ పార్టీ మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ అన్నారు. ఆల్విన్ కాలనీ డివిజన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు, అవని స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు శిరీష సత్తూరి కాంగ్రెస్ పార్టీలో చేరగా.. కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలలో ఉచిత బస్సు ప్రయాణం, 500 గ్యాస్ సిలిండర్, ప్రతి నెలా 2500 మహిళలకు ఇస్తున్నట్లు తెలిపారు.
అవని స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు శిరీష సత్తూరి మాట్లాడుతూ.. 8 సంవత్సరాలుగా టిఆర్ఎస్ పార్టీలో ఉండి సేవ చేస్తూ ప్రజల ఆశీస్సులు పొందానని, మరింత ప్రజా సేవ చేసేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు.