- బిఆర్ఎస్ నుంచి నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరిక
- సాదరంగా ఆహ్వనించిన జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి: ప్రజల ఆశీర్వాదం ఈసారి బలంగా ఉందని, శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజార్టీ సాధిస్తుందని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. ప్రభుత్వం నుంచి భారీగా నిధులు తీసుకువచ్చి నియోజకవర్గంలోని అన్ని డివిజన్లను అభివృద్ధి చేస్తామని అన్నారు. ఎంపీ గెలుస్తే మరింత అభివృద్ధి చేసుకొనే అవకాశం ఉందని అందుకు కార్యకర్తలు సిఫాయిల్లా పనిచేయాలనీ కోరారు.
అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని మొగళ్ళమ్మ బస్తి, పీజేఆర్ నగర్ ఫేస్ 2 బస్తిలలో బిఆర్ఎస్ పార్టీ నుంచి నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ కండువా కప్పి శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ పార్టీలోకి ఆహ్వానించారు.
అల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షులు మరేళ్ల శ్రీనివాస్, రాజా, సత్యనారాయణ, ఓట్స్ రవి, రాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయుడు, నాయక్, కొండా రెడ్డి, కిషన్, రాజేష్, అనిల్, శైలేష్, రాజేష్, రెడ్యా నాయక్, నర్సింహ, శ్రీను, గంగా నాయక్, భాగ్య రాజు, యేసు, కరుణాకర్, ఈశ్వర్, నాగరాజు, కృష్ణ పాల్గొన్నారు.