- గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి: పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలో గోపనపల్లి లో డివిజన్ శక్తి కేంద్రం ఇన్చార్జిలు, ముఖ్య నాయకుల సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్, బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వసంత్ కుమార్ యాదవ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి సోదరీమణి అనితారెడ్డి, డివిజన్ అధ్యక్షులు కృష్ణ ముదిరాజ్ తో కలిసి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.
గత పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి గెలిచిన రంజిత్ రెడ్డి చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి చేసింది ఏమి లేదని, కనీసం ఒక్కరోజు ఈ ప్రాంతాల్లో తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకోలేదన్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన, ప్రజా సంక్షేమం కోసం పనిచేసే కొండా విశ్వేశ్వర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తే నియోజకవర్గంలో పాటు మన ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికలలో అనేక పొరపాట్ల వల్ల భారతీయ జనతా పార్టీ ఓటమి పాలయిందని, ఇప్పుడున్న పరిస్థితులలో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశం అభివృద్ధి చెందిన నేపథ్యంలో ఇతర పార్టీల వారు, విద్యాధికులు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచడానికి సిద్ధంగా ఉన్నారని, మీరంతా 45 రోజులు పార్టీకి సమయం కేటాయించి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలుపునకు కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు, బూత్ అధ్యక్షులు, బూత్ కమిటీ ఇంచార్జిలు, శక్తి కేంద్రల ఇంచార్జిలు, డివిజన్ నాయకులు, బీజేవైఎం నాయకులు, యువ మోర్చా నాయకులు, మహిళా మోర్చా నాయకులు, కిసాన్ మోర్చా నాయకులు, ఎస్సీ మోర్చా నాయకులు, ఎస్టి మోర్చా నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.