- పి. గోవర్ధన్ రెడ్డిని వరించిన అధ్యక్షుడి పీఠం
- బార్ అసోసియేషన్ సభ్యుల అభ్యున్నతికి పాటుపడతానని హామీ
- ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక
నమస్తే శేరిలింగంపల్లి: కూకట్ పల్లి కోర్టు బార్ అసోసియేషన్ ఎన్నిక రసవత్తరంగా జరిగింది. ఈ ఎన్నికలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడి పీఠం పి. గోవర్ధన్ రెడ్డిని వరించింది. ఉప అధ్యక్షుడిగా పి. నటరాజ్, జనరల్ సెక్రటరీగా తాండ్ర రమేశ్, జాయింట్ సెక్రటరీగా బి. వాదయ్య, ట్రెజరర్ గా ఎండీ ఖలీల్ పాషా, లైబ్రరీ సెక్రటరీగా వి. శ్రీలత, స్పోర్ట్స్ & కల్చరల్ సెక్రటరీగా మీసాల అరుణ కుమార్, లేడీ సెక్రటరీగా ఎల్. సదాలక్ష్మీ, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా బోరెడ్డి ప్రవీణ్, పి. విజయ్ కుమార్, నాతి రమేష్ , ఎ. చంద్రమౌళి, పి. పల్లవి, ఎన్. నాగలక్ష్మి, గన్నె జ్యోత్స్నా దేవి లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పి. గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ బార్ అసోసియేషన్ సభ్యుల అభ్యున్నతికి పాటుపడతానని, తనపై నమ్మకముంచి ఎన్నుకున్నందుకు ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
- పోటీ వివరాలు..
- కూకట్ పల్లి కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడి బరిలో ముగ్గురు (పి. గోవర్ధన్ రెడ్డి, పరమేశ్వర్, జాకీర్ హుస్సేన్) మధ్య పోటీ జోరుగా సాగింది. పి. గోవర్ధన్ రెడ్డి 340 ఓట్లతో ముందజంలో దూసుకెళ్లారు. 126 ఓట్లతో రెండో స్థానంలో పి. పరమేశ్వర్ , 81 ఓట్లతో మూడవ స్థానంలో షేక్ జాకీర్ హుస్సేన్ నిలిచారు.
- ఉప అధ్యక్షుడి రేసులో.. ఈ పోటీలో నలుగురు బరిలో దిగారు. వీరిలో పి. నటరాజుకు అత్యధికంగా 182 ఓట్లు పోలవడంతో ఉప అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత డి. మల్లేశ్ 175 ఓట్లు, బొంపల్లి సత్యనారాయణ 120 ఓట్లు, కె. కృష్ణవేణి 64 ఓట్లతో వెనకంజలో నిలిచారు.
- జనరల్ సెక్రటరీ రేసులో.. టి. రమేశ్ కు 280 ఓట్లు పోలవగా.. ఏ సుదర్శన్ రెడ్డి 248 ఓట్లు, ఎం. శంకర్ 17 ఓట్లు పోలయ్యాయి.
- జాయింట్ సెక్రటరీ రేసులో.. బి. వాదయ్య 181ఓట్లు, కె. దేవీదాస్ 141 ఓట్లు, ఎం. కాళీ శ్రీనివాస్ సింగ్ 132 ఓట్లు, కె. సురేశ్ 86ఓట్లు పోలయ్యాయి.
- ట్రెజరర్ రేసులో.. ఎండీ ఖలీల్ పాషా 321ఓట్లు, డి. నాగభూషణం 116ఓట్లు, డి. సోమేశ్వర రావు 97ఓట్లు పోలయ్యాయి.
- లైబ్రరీ సెక్రటరీ రేసులో.. వి. శ్రీలత 180ఓట్లు, ఎం. లావణ్య 166ఓట్లు, పి. సంతోష్ కుమారీ 142 ఓట్లు, ఎ. శ్రీ రాములు 54ఓట్లు పోలయ్యాయి.
- స్పోర్ట్స్ & కల్చరల్ సెక్రటరీ రేసులో.. మీసాల అరుణ కుమార్ 336ఓట్లు, ఎ. రమేష్ 201ఓట్లు పోలయ్యాయి.
- లేడీ సెక్రటరీ రేసులో.. ఎల్. సదాలక్ష్మీ 318ఓట్లు, బి.వి.ఎన్.ఎల్ లత 219 ఓట్లు పోలయ్యాయి.
- ఎగ్జిక్యూటీవ్ మెంబర్స్ రేసులో.. బోరెడ్డి ప్రవీణ్ 293ఓట్లు, పి. విజయ్ కుమార్ 262 ఓట్లు, నాతి రమేష్ 259ఓట్లు, ఎ. చంద్రమౌళి 254ఓట్లు, పి. పల్లవి 243ఓట్లు, ఎన్. నాగలక్ష్మి 245ఓట్లు, గన్నె జ్యోత్స్నా దేవి 230ఓట్లు, యూ. రామకృష్ణ 214ఓట్లు, కరుణా బొడ్డి రెడ్డి 170ఓట్లు, డి. సత్యనారాయణ వరప్రసాద్ 139 ఓట్లు, నౌషీన్ 110ఓట్లు పోలయ్యాయి.