ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా..

  • మహిళా గొంతుకనవుతా.. -పార్లమెంట్ కి వెళ్లే అవకాశం ఇవ్వండి
  • జీవితాంతం ప్రజా సేవకె అంకితం: జడ్పి చైర్ పర్సన్, చేవెళ్ల పార్లమెంటరీ కాంగ్రెస్ నేత పట్నం సునీతారెడ్డి
  • శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ లో చేరిన 500 మంది బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు
  • సునితమ్మ కోసం ఐటీ ఉద్యోగానికి రాజీనామా.. కాంగ్రెస్ కండువా కప్పుకున్న కోట్ల దీప్తిరెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి : కాంగ్రెస్ ప్రజా పాలనకు మెచ్చి చేరికలు పెద్ద ఎత్తున్న మొదలయ్యాయి. ఆ పార్టీ వెంటే తామంటూ మద్దతు తెలుపుతున్నారు. అంతేకాక శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్, కార్పొరేటర్ పూజిత గౌడ్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సునీతారెడ్డి విస్తృతంగా పర్యటించారు.
బీఆర్ఎస్, బిజెపి పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

సమావేశంలో మాట్లాడుతున్న జడ్పి చైర్ పర్సన్, చేవెళ్ల పార్లమెంటరీ కాంగ్రెస్ నేత పట్నం సునీతారెడ్డి

ఈ సందర్భంగా సునితమ్మ మాట్లాడుతూ.. తనకు అవకాశం కల్పిస్తే పార్లమెంట్ లో మహిళా గొంతుక నవుతా” అని వికారాబాద్ జడ్పి చైర్ పర్సన్, చేవెళ్ల పార్లమెంటరీ కాంగ్రెస్ నేత పట్నం సునీతామహేందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా నల్లగండ్ల, హైదర్ నగర్ లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ ఇవ్వాలని కోరారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

సమావేశంలో మాట్లాడుతున్న జగదీశ్వర్ గౌడ్

పదేళ్ల నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ అప్పులపాలు చేస్తుందని అన్నారు. శేరిలింగంపల్లి కాంగ్రెస్‌ పార్టీ బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తలను కాపాడుకుంటానని అన్నారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీని అందించడం ఖాయమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన కార్యకర్తలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని బీఆర్ఎస్, బిజెపి పార్టీ నుంచి సుమారు 500 మందికి పైగా కార్యకర్తలు, నాయకులు సునీతారెడ్డి సమక్షంలో కాంగ్రెసులో చేరారు. ప్రజల ఆశీర్వాదం ఈసారి బలంగా ఉందని, శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ తిరుగులేని మెజార్టీ సాధిస్తుందని అన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో సిటీకి ఆనుకోని ఉన్న శేరిలింగంపల్లి అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు.

పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, ప్రజలు

కాంగ్రెస్ ఇంచార్జీ వి.జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన శేరిలింగంపల్లి లో మెజార్టీ సాధించి ఎంపీని కానుకగా ఇస్తామని అన్నారు. ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీలు పోటీకి ముందే చతికిల పడిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని, ప్రభుత్వం నుంచి భారీగా నిధులు తీసుకువచ్చి నియోజకవర్గంలోని అన్ని డివిజన్లను అభివృద్ధి చేస్తామని అన్నారు. ఎంపీ గెలుస్తే మరింత అభివృద్ధి చేసుకొనే అవకాశం ఉందని, అందుకు కార్యకర్తలు సిఫాయిల్లా పనిచేయాలని కోరారు. మొదటిసారి శేరిలింగంపల్లికి వచ్చిన సునీతారెడ్డి కి జగదీశ్వర్ గౌడ్ దంపతులు, కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. తాము ప్రజలకు, మైనార్టీలకు, బడుగు బలహీన వర్గాలకు, ఐటీ ఉద్యోగులకు అండగా ఉంటామని అన్నారు.


హాఫీజ్ పెట్ డివిజన్ శాంతి నగరలో నివాసముంటున్న ఐటీ ఉద్యోగిని కోట్ల దీప్తి రెడ్డి తన ఉద్యోగానికి రాజీనామా చేసి సునితమ్మ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆమె భర్త కోట్ల రజీత్ భార్గవ్ రెడ్డి సైతం కాంగ్రెసులో చేరారు. సునితమ్మ మీద ఉన్న అభిమానం మేరకు, ఆమెకు తనవంతు మద్దతు తెలపడానికి సుమారు 50 అంది మహిళలతో కలిసి కాంగ్రెసులో చేరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, మహిళ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here