బిజెపితోనే సమగ్ర అభివృద్ధి: బీజేపీ శాసనసభ పక్షనేత మహేశ్వర్ రెడ్డి

  • సంక్షేమం అంటేనే నరేంద్ర మోడీ అభివృద్ధి : చేవెళ్ల మాజీ పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి : దేశ అభివృద్ధి అణగారిన వర్గాల అభివృద్ధి ప్రధాని మోడీ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని ప్రజలు నమ్ముతున్నారని బీజేపీ శాసనసభ పక్షనేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. విజయ సంకల్ప యాత్రలో భాగంగా శేరిలింగంపల్లి అసెంబ్లీ నానక్ రామ్ గూడ నుండి మియాపూర్ ఆల్విన్ కాలనీ చౌరస్తా వరకు జరిగిన రోడ్ షో… హఫీజ్ పేట్ డివిజన్ ఆల్విన్ కాలనీలో భారీ బహిరంగ సభ నిర్వహించారు.

విజయ సంకల్ప యాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి,

ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా శాసనసభా పక్ష నేత ఎ.మహేశ్వర్ రెడ్డి, చేవెళ్ల మాజీ పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ ఇంఛార్జి మల్లారెడ్డి, ప్రబారి శ్రీనివాస్ ,అసెంబ్లీ కన్వీనర్ రాఘవేంద్ర రావు, కొరడాల నరేష్, కసిరెడ్డి భాస్కర్ రెడ్డి , సురభి రవీంద్ర రావు, ప్రభాకర్ యాదవ్, మహేష్ యాదవ్, నవతారెడ్డి, సింధు రెడ్డి, బిందు, నరేందర్ రెడ్డి, మహేష్ యాదవ్, శ్రీధర్ గౌడ్, బీజేపీ శ్రేణులతో కలిసి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కంటేస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బిజెపి దేశ వ్యాప్తంగా చేపట్టిన విజయ సంకల్ప యాత్రల్లో భాగంగా తెలంగాణలో ఐదు యాత్రలు జరుగుతున్నాయని, ఇందులో వేలాదిగా ప్రజలు, యువత, రైతులు తరలివస్తున్నారని చెప్పారు. దేశ అభివృద్ధి అణగారిన వర్గాల అభివృద్ధి మోడీ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని, ప్రజలు నమ్ముతున్నారని అన్నారు.

పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, ప్రజలు

మోడీ రి సంక్షేమ పథకాల పట్ల ప్రజల నుండి మంచి స్పందన ఉందన్నారు. గత ప్రభుత్వం చేసిన మోసాలు మళ్ళీ కాంగ్రెస్ చేసిన మోసాలు ప్రజలకు అవగాహనా ఉందని, ప్రజలు కుటుంబ పార్టీలను నమ్మరని, ప్రజలు రామరాజ్యం రావాలని కోరుకుంటున్నారని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రం లో మళ్ళీ మోడీ గారే ప్రధాన మంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, మూడవ సారి మోడీ గారు ప్రధాని కావడం ఖాయమని, ముఖ్యంగా తెలంగాణా నుండి అత్యధిక ఎంపీ సీట్లు గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు, వివిధ మోర్చల నాయకులు, కార్యకర్తలు అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here