- కాంగ్రెస్ పార్టీలో చేరిన వివేకానంద డివిజన్ బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు
- పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని కాంగ్రెస్ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీతోనే విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని, సేవా గుణం కలిగిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ అన్నకు తోడుగా అడుగులు అడుగై ఉంటామని పార్టీలో చేరిన కార్యకర్తలు తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ..ఎమ్మెల్యేగా గెలిచిన మొదటి రోజు నుండి మీ సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ సంక్షేమ పథకాలు ఇందిరమ్మ ఇల్లు, మహాలక్ష్మి పథకం రైతు భరోసా, గృహలక్ష్మి, యువ వికాసం, వృద్ధులకు, వికలాంగులకు చేయూత, 6 గ్యారంటీ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతాయని, కాంగ్రెస్ పార్టీ అందరికీ న్యాయం చేసే పార్టీగా మీ అందరికీ తెలుసా అని, కాంగ్రెస్ పార్టీతోనే అన్ని విధాలుగా ప్రజలకు మేలు జరుగుతుందని వివరించారు. నవంబర్ 30 తారీఖు రోజు హస్తం గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.
వివేకానంద నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంటెస్టెడ్ కార్పొరేటర్ భాష్పాక నాగమణి యాదగిరి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ నాయకురాలు భారతమ్మ శివరాత్రి, రవికుమార్ కృష్ణ స్వామి తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరగా.. శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ వారికి పార్టీ కండువాా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో కల్పన ఏకాంత్ గౌడ్, చిరుమర్తి రాజు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజు, కచ్చిగల్లారమేష్, పరశురాములు, ముకయ్య నాగుల మల్లేష్ పాల్గొన్నారు.